- మున్సిపాలిటీగా 150 ఏళ్ల చారిత్రక ప్రస్థానం
- ఆర్ట్ గ్యాలరీ, సాంస్కృతిక కార్యక్రమాలతో నగరంలో సందడి
ప్రజాశక్తి-ఒంగోలు సిటీ : ఒంగోలు నగర మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఒంగోలు ఉత్సవం’ బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నగర చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆర్ట్ గ్యాలరీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ ప్రదర్శనలతో నగరం సందడిగా మారింది. ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, రాజ్యసభ సభ్యులు బాష్యం రామకృష్ణ, లోక్‌సభ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఎ. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు ఒంగోలు నగర చారిత్రక ప్రస్థానాన్ని, ఘన కీర్తిని కొనియాడారు. 150 ఏళ్లుగా నగరం సాధించిన అభివృద్ధి, సామాజిక, సాంస్కృతిక ప్రగతిని స్మరించుకుంటూ భవిష్యత్ ఒంగోలు అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.








కామెంట్‌లు (0)