సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

భూ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలి లేకపోతే ఉద్యమాలు ఉధృతం : వి.శ్రీనివాసరావు

49 నిమిషాల క్రితం

Land titles must be issued to cultivators; otherwise, agitations will intensify: V. Srinivasa Rao.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:17 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నారాయణపురం భూ సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని లేకపోతే ప్రజల మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.తులసీదాస్ హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో జరుగుతున్న పాదయాత్ర సందర్భంగా చిలకపాలెంలో నారాయణపురం భూ పోరాట కమిటీ కన్వీనర్ తోనంగి.నందోడు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ .... నారాయణపురం భూములను తరతరాలుగా సాగు చేస్తున్న భూసాగుదారులకు పట్టాలు ఇవ్వాలని, గత 50 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా రైతులకు పట్టాలు ఇవ్వలేదని విమర్శించారు. 50 ఏళ్లుగా జరుగుతున్న పోరాటం సందర్భంగా ఈరోజు పాదయాత్ర జరుగుతుందని ఇది ఒక అపూర్వమైన ఉద్యమం అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటుందా భూ బకాసురులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పక్షాన ఉంటుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తప్పుడు పత్రాలు సృష్టించిన రికార్డులు తారుమారు చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు వారి మీద కేసులు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పాదయాత్ర సందర్భంగా రైతులకు పట్టాలు ఇవ్వాలని లేని పక్షంలో ఈ ఉద్యమం అమరావతి వారికి కొనసాగుతుందన్నారు. సాగుదారులకు పట్టాలు లేకపోవడం వలన రైతు భరోసా ,వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు మొదలగు ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడంగల్ లో 2013 వరకు సాగుదారులుగా ఉన్న వారిని అర్ధాంతరంగా ఎందుకు తొలగించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం సమస్య పరిష్కారం చేయకపోవడంతో రైతాంగం తీవ్ర అన్యాయానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మరొకవైపున రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ బకాసురులు తప్పుడు పత్రాలు సృష్టించి తరతరాలుగా సాగు చేస్తున్న రైతులు భూములను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ అండదండలతో భూకబ్జాదారులు రైతాంగ భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని సాగుదారులుగా నమోదు చేసిన వారికి పట్టాలు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించిన భూ బకాసురులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవడం లేదని ప్రశ్నించారు. నారాయణపురం భూసాగుదారులకు పట్టాలు ఇచ్చేవరకు పోరాటం కొనసాగిస్తామని తెలియజేసారు. రైతుల పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పాదయాత్రకు దారిపొడవునా ప్రజలు సంఘీభావం తెలియజేస్తూ పూలవర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు కార్యదర్శివర్గ సభ్యులు కె.మోహనరావు, పి.తేజేశ్వరరావు, బి.కృష్ణమూర్తి, సిపిఎం మండల కార్యదర్శి ఎన్.వి.రమణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు, నారాయణపురం భూ సాగుదారుల పోరాట కమిటీ నాయకులు తోనంగి.నండోడు, కోరాడ.అప్పన్న, పుట్టా. కవిలేశ్వరరావు, పుట్టా.మల్లేశ్వరరావు, జరజాపు.సీతారామ్, తోనంగి.పైడయ్య, పుట్టా.బుచ్చిరాజు, వై.గోపాలుడు, చిలకపాలేం మాజీ సర్పంచ్ చిలక.రాము, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కే.నాగమణి, పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, నాగార్జున అగ్రికం, ఏపీబీసీఎల్, శ్యాంక్రగ్ పిస్టన్స్ ప్లాంట్ 3 యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Land titles must be issued to cultivators; otherwise, agitations will intensify: V. Srinivasa Rao.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్