శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు ప్రమాదం - ఇద్దరు యువకులు మృతి

12 నిమిషాల క్రితం

Two young men die in a road accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 27, 2026, 11:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

చంద్రగిరి (తిరుపతి) : తిరుపతి జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, నేంద్రగుంట ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.


పాకాల ఇన్స్పెక్టర్ టి.చిన్న గోవిందు తెలిపిన వివరాల మేరకు .. మదనపల్లి మంజునాథ (30), తండ్రి ఈశ్వరయ్య, స్వగ్రామం శెట్టిపల్లి పంచాయతీ, అడవికమ్మపల్లి, సంబేపల్లి మండలం, అన్నమయ్య జిల్లా. ప్రస్తుతం బెంగళూరులోని కోరమంగళంలో నివసిస్తూ Angel One కంపెనీలో ట్రేడింగ్‌కు సంబంధించిన పని చేస్తున్నాడు. ఇతనికి వివాహమై భార్య అర్పిత, మూడు నెలల కుమారుడు ఉన్నారు. మరో మృతుడు పూజారి చందు (19), తండ్రి లేట్ శ్రీనివాసులు, అంబేద్కర్ నగర్, రాజీవ్ నగర్, తిరుపతికి చెందినవాడు. ఇంటర్మీడియట్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. పూజారి చందు తన అక్కను ఆసుపత్రిలో పరామర్శించేందుకు తన స్నేహితుడైన మదనపల్లి మంజునాథతో కలిసి AP 39 ET 7442 నంబరు గల యమహా FZ ద్విచక్ర వాహనంపై బెంగళూరు నుంచి బయలుదేరారు. ఈ క్రమంలో మంజునాథ ద్విచక్ర వాహనాన్ని నడుపుతుండగా, చందు వెనుక కూర్చొని ప్రయాణిస్తున్నాడు. వీరు పాకాల మండలం నేంద్రగుంట ఫ్లైఓవర్ సమీపానికి చేరుకున్న సమయంలో, ద్విచక్ర వాహనాన్ని అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్ల రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ ద్విచక్ర వాహనం నుంచి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర రక్తగాయాలై మృతి చెందారు. ఈ ప్రమాదానికి ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మదనపల్లి మంజునాథ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని మృతుడు పూజారి చందు మామ వెంకట జగన్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాకాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని SV మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పాకాల పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ టి.చిన్న గోవిందు ఆధ్వర్యంలో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.


Two young men die in a road accident


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్