సియోల్ : కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధంలో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం లేదని దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి చోహ్యూన్ తెలిపారు. ఆ ప్రాంతంలో సైనిక బృందాలను మోహరించే ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీతో చోహ్యూన్ గురువారం ఫోన్‌లో సంభాషించినట్లు దక్షిణ కొరియాలోని ఇరాన్ దౌత్య కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇరువురు నేతలు తాజా ప్రాంతీయ పరిస్థితుల గురించి, అలాగే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి సుదీర్ఘంగా చర్చించారని ఆ ప్రకటన పేర్కొంది. ‘‘పశ్చిమాసియా ప్రాంతంలో విదేశీ సైనిక మోహరింపుపై అరాఘ్చీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు ఉద్రిక్తతలను పెంచుతాయని, సంఘర్షణను ప్రస్తుత భౌగోళిక పరిధికి మించి మరింత విస్తరింపచేస్తాయని పేర్కొన్నారు. దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి హ్యూన్ ఇరాన్‌కు సంఘీభావం ప్రకటిస్తూ.. తాము అటువంటి చర్యలు చేపట్టబోమని హామీ ఇచ్చారు’’ అని ప్రకటన తెలిపింది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలకు దక్షిణ కొరియా మద్దతు ఉంటుందని విదేశాంగ మంత్రి చో పునరుద్ఘాటించారు. తాము ఈ యుద్ధంలో జోక్యం చేసుకోవాలనే లేదా పాల్గొనాలనే ఉద్దేశంతో లేమని, అలాగే ఈ ప్రాంతానికి బలగాలను పంపే ప్రణాళికలేవీ లేవని విదేశాంగ మంత్రి అరాగ్చికి ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుత యుద్ధాన్ని, ఉద్రిక్తతలను ముగించేందుకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు" అని ప్రకటన వెల్లడించింది.
పశ్చిమాసియా యుద్ధంలో జోక్యం చేసుకోం : దక్షిణ కొరియా
15 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 27, 2026, 11:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)