శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అనారోగ్యంతో ఉన్న చిన్నారికి రూ25 వేలు ఆర్థిక సహాయం

4 గంటల క్రితం

chinnariki .jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 07, 2026, 04:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి..విజయనగరం టౌన్ : మదర్ తెరిసా సేవా సంఘం అండ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనారోగ్యంతో ఉన్న చిన్నారికి రూ25 వేలు ఆర్థిక సహాయం అందించింది. విజయనగరం పట్టణంలో అయ్యన్నపేట జంక్షన్ లో ఉన్న మదర్ తెరిసా సేవా సంఘం అండ్ బ్లడ్ డోనర్స్ క్లబ్ కార్యాలయంలో ఆనందపురం మండలం, దిబ్బమీదపాలెం గ్రామానికి చెందిన పూర్ణిమ అనే 15 నెలల చిన్న పాపకు పుట్టుకతోనే లివర్ ప్రాబ్లం ఉండడంతో, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని ట్రీట్మెంట్ చేస్తున్న చెన్నై లో ఉన్న రేలా హాస్పిటల్ డాక్టర్లు చెప్పడంతో, పాపకు ఆమె యొక్క తల్లి డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ ఆపరేషన్ నిమిత్తం సుమారు 25 లక్షల ఖర్చు అవుతుండడంతో, తండ్రి లారీ క్లీనర్ గా చేస్తున్న ఈ నిరుపేద కుటుంబం, ఆర్థికంగా తట్టుకోలేక, వివిధ స్వచ్ఛంద సంస్థలను, ప్రభుత్వాన్ని సహాయం చేయమని కోరడమైనది. ఈ సందర్భంగా వారు మదర్ తెరిసా సేవా సంఘం అధ్యక్షుడు త్యాడ ప్రసాద్ పట్నాయక్ ను సంప్రదించగా, పాప యొక్క పరిస్థితిని పరిశీలించిన తర్వాత, సేవా సంఘం సభ్యులు తక్షణమే స్పందించి, సంఘంలో ఉన్న 32 మంది సభ్యులు కలిపి 25,000/- రూపాయలు ను పాప తండ్రి ఈశ్వర్రావుకు అధ్యక్షులు- ప్రసాద్ పట్నాయక్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా పాప యొక్క తల్లిదండ్రులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు రాము, అన్నదాత సుఖీభవ అధ్యక్షురాలు- కాంచన, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్