హైదరాబాద్ : ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న ‘NBK111’నుండి ఆమె ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన దర్శకుడు కాజల్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. `` అందరూ తెరపై కాజల్ అద్భుతమైన నటనను చూస్తారు. కానీ ఆమె గొప్ప మనసును చూసే అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తున్నా. కాజల్ తన నటనతో ఈ చిత్రానికి మరింత శక్తిని జోడించారు'' అని ఎక్స్ లో పేర్కొన్నారు. అలాగే, 'ప్రతి తుపాను వెనక ఓ బలమైన కారణం ఉంటుంది' అంటూ నిర్మాణ సంస్థ ఈ పోస్టర్‌కు పవర్‌ఫుల్ క్యాప్షన్ ఇచ్చింది. గతంలో బాలకృష్ణ -కాజల్ జంటగా నటించిన 'భగవంత్ కేసరి' భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 1993 నాటి ముంబయి నేపథ్యంలో సాగే ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణ గ్యాంగ్‌స్టర్ తరహా పాత్రలో పవర్‌ఫుల్ అండ్ స్టైలిష్ లుక్‌తో అలరించనున్నారు. ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
‘NBK111’ నుండి కాజల్ ఫస్ట్ లుక్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 19, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)