mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మానసిక ఒత్తిడితో నీట్ విద్యార్థిని ఆత్మహత్య

1 గంట క్రితం

NEET aspirant dies by suicide in Lucknow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 19, 2026, 01:27 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : మరో నీట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. లక్నోకు చెందిన సుహానీ యాదవ్ (17) అనే విద్యార్థిని మంగళవారం ఫ్యాన్ కు ఉరివేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎటువంటి సూసైట్ నోట్ లభించలేదని అన్నారు. విద్యార్థిని కుటుంబం పాట్నాకు చెందినదని, ఆమెతండ్రి రైల్వేలో ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ గా పనిచేస్తున్నారని అన్నారు. మే 3న జరిగిన నీట్- యుజి పరీక్షను తాను బాగా రాశానని, ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానని విశ్వాసంతో ఉన్నట్లు విద్యార్థిని వెల్లడించిందని కుటుంబసభ్యులు తెలిపారు. పరీక్ష రద్దయిందని తెలిసినప్పటి నుండి ఆమె తీవ్ర మానసకి ఒత్తిడికి గురయ్యిందని అన్నారు. ఆమె రెండు, మూడు రోజుల పాటు కుంగుబాటులో ఉందని, తర్వాత మళ్లీ పరీక్షకు ప్రిపేర్ అవడం ప్రారంభించిందని అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్