mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సంధ్య థియేటర్ తొక్కిసలాట - కోర్టుకు అల్లు అర్జున్ హాజరుపై సందిగ్ధత

1 రోజు క్రితం

allu arjun
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసుకు సంబంధించి హీరో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరుకావల్సి ఉండగా ... ఆ విషయమై సందిగ్ధత నెలకొంది. మూవీ షూటింగ్‌ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అల్లు అర్జున్ కోరినట్లు తెలుస్తుంది. అయితే, కోర్టు అందుకు అమతిస్తుందా ? లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఎ 11గా చేర్చారు. ఎ 1 నుంచి ఎ 10 వరకు సంధ్య థియేటర్‌ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్‌ దాఖలయ్యింది. 2024 డిసెంబర్‌ 4వ తేదీన పుష్ప-2 బెనిఫిట్‌ షో సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి విదితమే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత విచారణ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధమయ్యింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్