న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ అండర్‌గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీయూఈటీ (యూజీ)-2026 పరీక్ష ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. లక్షలాది మంది విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ నమోదు చేసి స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సీయూఈటీ (యూజీ)-2026 పరీక్షలను మే 11 నుంచి 31 వరకు, అదనంగా జూన్ 6, 7 తేదీల్లో మొత్తం 19 రోజుల పాటు 35 షిఫ్టుల్లో నిర్వహించారు. అనంతరం జూన్ 9న ప్రాథమిక ఆన్సర్ కీని విడుదల చేసి, విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించారు. వాటిని పరిశీలించిన తర్వాత సోమవారం తుది ఆన్సర్ కీని ప్రకటించిన అధికారులు, తాజాగా ఫలితాలను విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం : https://cdnbbsr.s3waas.gov.in/s3d1a21da7bca4abff8b0b61b87597de73/uploads/2026/06/20260623716111016.pdf
ఈ ఏడాది పరీక్షకు దేశవ్యాప్తంగా 15,68,867 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, వారిలో 11,64,098 మంది పరీక్షకు హాజరయ్యారు. స్కోరు వివరాల కోసం : https://examinationservices.nic.in/ResultoService26/CUET2026/Login









కామెంట్‌లు (0)