లక్నో : అయోధ్య రామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి వస్తున్న వార్తలపై సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బిజెపిపై మంగళవారం తీవ్ర విమర్శలు చేశారు. విరాళాల దుర్వినియోగానికి సంబంధించి మరిన్ని వివరాలకు వెలుగులోకి వస్తున్నకొద్దీ బిజెపి నేతలు వాటిని మరింత కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారని అఖిలేష్ ఆరోపించారు.
కాగా, బిజెపి పాపాలకు సంబంధించిన మరొక పొర తొలగించబడింది. బిజెపి సభ్యులు, వారి అనుచరుల 'ఘోర పాపాల' పొరలు ఇలాగే బయటపడుతూ ఉంటే.. విచారణకు బదులుగా వాటిని కప్పిపుచ్చే పనే మరింత వేగంగా మొదలవుతుంది అని అఖిలేష్ యాదవ్ తన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టులో పేర్కొన్నారు. రామ మందిర విరాళాల్ని ఆ ట్రస్ట్ సభ్యులే దొంగిలించారని సంఘ్‌ఫరివార్ నేత సంతోష్ దుబే బయటపెట్టారు. ఈ వివాదం రోజురోజుకీ ముదురుతోంది.








కామెంట్‌లు (0)