mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘గల్లీ`తో హాన్సిక రీ ఎంట్రీ

2 రోజుల క్రితం

Hansika
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 16, 2026, 08:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అల్లు అర్జున్ ‘దేశముదురు’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కథానాయిక హన్సిక మోత్వాని మంచి సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు . తెలుగు, తమిళం, హిందీలో ఆ తర్వాత వరుస స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాను ప్రేమ వివాహం చేస్తున్నారు. ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ఇటీవల వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించబోతున్నారు. ప్రవీణ్ సట్టారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గల్లీ’ అనే భారీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ ద్వారా ఆమె మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జేడీ చక్రవర్తి, సుధీర్ బాబు, ప్రిన్స్, శ్రీనిధి శెట్టి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్