టిఎఫ్‌సిసి షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్–2026 విజేతలకు నగదు బహుమతులు, పురస్కారాలను సినీరంగ ప్రముఖులు డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రదానం చేశారు. ‘శీనుగాడి సైకిల్ స్టోరీ’, ‘సైబర్ స్లేవరీ’, ‘మాతృదేవోభవ’ చిత్రాలు వరుసగా తొలి, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కించుకున్నాయి. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా జర్నలిస్టుగా వినాయకరావు, ఫొటో జర్నలిస్టుగా భూషణ్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా సతీష్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జర్నలిస్టుగా రఘు, కెమెరామెన్‌గా పాషా, వీడియో జర్నలిస్టుగా నాగరాజు యాదవ్, డిజిటల్ మీడియా జర్నలిస్టుగా రాజబాబు, ఫిలిం మేగజైన్‌గా బాక్సాఫీస్, ఫిలిం ఈ-పేపర్‌గా విజయ్ అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా టీఎఫ్‌సీసీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులను అందిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి తొలి బహుమతిని లక్ష రూపాయలకు పెంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది 60కి పైగా ఎంట్రీలు వచ్చాయని, జ్యూరీ ఛైర్‌పర్సన్ ఇంద్రజ అన్ని షార్ట్ ఫిలింలను పరిశీలించి విజేతలను ఎంపిక చేశారని చెప్పారు. ముందుగా ప్రకటించిన దానికంటే నగదు బహుమతులను పెంచి తొలి, ద్వితీయ, తృతీయ బహుమతులుగా వరుసగా రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు అందించామని తెలిపారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున ఫిలిం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
Print Editionటిఎఫ్‌సిసి అవార్డుల ప్రదానం
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 23, 2026, 08:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)