టోక్యో : జపాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. జపాన్ ఈశాన్య ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు జపాన్ వాతావరణ శాఖ (జెఎంఎ) ఒక ప్రకటనలో తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. 41కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జపాన్‌లోని ఇవాటే తీరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై తీవ్రత 6గా నమోదైంది. వారం రోజుల పాటు 6 తీవ్రతతో భూమి కంపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
జపాన్‌లో మరోసారి భూకంపం
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)