mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కరాచీలో సింధ్ రేంజర్ల స్థావరంపై ఆత్మాహుతి దాడి..

3 గంటల క్రితం

attack
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 10:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నలుగురు సైనికులు, ఆరుగురు ఉగ్రవాదులు మృతి!

కరాచీ : పాకిస్థాన్‌లోని కరాచీలో ఘోర ఉగ్రదాడి జరిగింది. గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలోని సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. వాహనాన్ని స్థావరానికి ఢీకొట్టి పేల్చివేసిన అనంతరం విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ భీకర ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, అప్రమత్తమైన భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన కమాండోలు, ప్రత్యేక పోలీసులు మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు. ఇటీవలి కాలంలో పాక్‌లో భద్రతా బలగాలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన ఈ ఘాతుకానికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ నుంచి విడిపోయిన ‘జమాత్-ఉల్-అహ్రార్’ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్