mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

డ్రగ్స్‌ కేసులో ఢిల్లీలో ఇడి సోదాలు

4 గంటల క్రితం

enforcement directorate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ (‌ఇడి) బుధవారం ఢిల్లీలో పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహిస్తోంది. 2021 ముద్రా పోర్ట్‌ ‌డ్రగ్స్‌ ‌స్వాధీన కేసులో మనీలాండరింగ్‌ ‌దర్యాప్తులో భాగంగా ఇడి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, ఈ కేసులో సంబంధమున్న ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త హర్‌‌ప్రీత్‌ ‌సింగ్‌ ‌తల్వార్‌ అలియాస్‌ ‌కబీర్‌ ‌తల్వార్‌తో సహా మరికొందరి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తల్వార్‌ ‌ఢిల్లీలో బాగా పేరుమోసిన నైట్‌‌క్లబ్స్‌‌ని నడిపేవారు. ఇతన్ని 2022 ఆగస్టులో డ్రగ్స్‌ పట్టుబడిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అరెస్టు చేసింది. గుజరాత్‌ ‌హైకోర్టు బెయిల్‌ ‌మంజూరు చేయడంతో అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు.

ప్రపంచంలోనే అతిపెద్ద మాదకద్రవ్యాల స్వాధీన చర్యలలో భాగంగా.. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని 'డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' (ఇడి లాంటి ఒక దర్యాప్తు సంస్థ) 2021 సెప్టెంబరులో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఉన్న ముంద్రా ఓడరేవు వద్ద 2,988.21 కిలోల ఆఫ్ఘన్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్