మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

అభిషేక్‌ బెనర్జీ కేసుల్లో అత్యవసర విచారణను తిరస్కరించిన కోల్‌కతా హైకోర్టు

24 జూన్, 2026

Calcutta High Court refuses
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 02:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కోల్‌కతా : టిఎంసి నేత అభిషేక్‌ బెనర్జీకి సంబంధించిన పిటిషన్‌లపై అత్యవసర విచారణ చేపట్టేందుకు కోల్‌కతా హైకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ కేసు సాధారణ ప్రక్రియలో భాగంగానే విచారణకు జాబితా చేయబడుతుందని, అత్యవసర విచారణను అనుమతించలేమని కోల్‌కతా హైకోర్టు జడ్జి జస్టిస్‌ సౌగత భట్టాచార్య పేర్కొన్నారు. కంటి చికిత్స కోసం విదేశాలకు వెళ్లాల్సి వున్నందున అత్యవసర విచారణ చేపట్టాలని అభిషేక్‌ బెనర్జీ కోర్టును కోరారు.రాష్ట్ర అసెంబ్లీలో సంతకాల మోసం, ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న కేసుల్లో ఇప్పటికే ఆయనను సిఐడి అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. నియామక స్కామ్‌కి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) ప్రశ్నించిందని ఆయన తెలిపారు.

2016 అక్టోబర్‌లో ముర్షిదాబాద్‌లోని పార్టీకార్యక్రమం ముగించుకుని కోల్‌కతాకు తిరిగి వస్తుండగా అభిషేక్‌ బెనర్జీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కళ్లకు తీవ్రగాయాలయ్యాయని, శస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వుందని పేర్కొన్నారు.


భూకబ్జా, మోసం ఆరోపణలపై కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అతిన్ ఘోష్, ఆయన కుమార్తె ప్రియదర్శిని ఘోష్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్