mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionతృణమూల్‌ దాడులపై శీఘ్ర విచారణ

3 గంటల క్రితం

HLkojgd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • బెంగాల్‌ సిఎంకు సిపిఎం ప్రతినిధి బృందం డిమాండ్‌

కొల్‌‌కతా : తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా సిపిఎం నేతలపై తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడిందని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని అనేక చోట్ల వామపక్షాల నేతలను హత్యలు చేయించిందని, ఈ కేసుల్లో విచారణ వేగవంతంగా చేపట్టాలని సిపిఎం డిమాండ్‌ ‌చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి సువేందు అధికారితో డోమ్‌కల్ ఎమ్మెల్యే మోస్తఫిజుర్ రహమాన్‌, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మీనాక్షి ముఖర్జీ నేతృత్వంలోని సిపిఎం ప్రతినిధి బృందం కలిసి విజ్ఞప్తి చేసింది. 2018 పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్‌ గూండాల వేధింపులు, దాడులతో సిపిఎం కార్యకర్తలు, మద్దతుదారులతో పాటు వ్యవసాయ కార్మికులు దేబుదాస్‌, ఉషారాణి దాస్‌ దంపతులు హత్యకు గురయ్యారని ఈ కేసుల్లో విచారణ వేగంగా చేపట్టాలని కోరింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్