mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లక్నోలో కోచింగ్‌ సెంటర్‌‌లో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది మృతి

5 గంటల క్రితం

Fire accident At Coaching Centre In Lucknow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 04:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : ఈశాన్య లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఒక కోచింగ్ సెంటర్ ఉన్న ఒక భవనంలో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. ఈ భవనంలో కొంతమంది చిక్కుకుపోయారు. కొంత మంది విద్యార్థులు తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఫస్ట్‌‌ఫ్లోర్‌ ‌నుంచి దూకారు. ఈ ఘటనకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన సుమారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. అలీగంజ్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో షా మెహతా మార్గ్‌లో ఉన్న ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ జరిగింది. సమాచారం అందిన వెంటనే హైడ్రాలిక్ ప్లాట్‌ఫారమ్ వాహనంతో సహా 14 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అగ్నిమాపక అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్