ఎల్‌అవీవ్ : ఇజ్రాయిల్ లెబనాన్‌పై దాడులు ఆపాలని అమెరికాతో కుదర్చుకోనున్న శాంతి ఒప్పందంలో ఇరాన్ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ సార్.. న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్‌స్టన్ పీటర్స్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హిజ్బుల్లా ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించనంత వరకు, లెబనాన్‌లో కాల్పుల విరమణను పాటించాలని ఇజ్రాయిల్ భావిస్తోంది. దక్షిణ లెబనాన్ ప్రస్తుతం ఇజ్రాయిల్ ఆధీనంలో ఉంది. లెబనాన్‌లో మాకు ప్రాదేశిక ఆకాంక్షలు లేవు. కానీ మేము సెక్యురిటీ జోన్ నుండి వైదొలగి, మా పౌరులను హిజ్బుల్లా దాడులకు, సంభావ్య దండయాత్రకు గురిచేయము’ అని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రితో చెప్పినట్లు ఇజ్రాయిల్ విదేశాంగ మంత్రి గిడియన్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
లెబనాన్ నుండి ఇజ్రాయిల్ వైదొలగదు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 22, 2026, 05:52 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)