mh ad
మంగళవారం, 23 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition25న ‘ఎన్‌బీకే 112’ ప్రారంభం

1 రోజు క్రితం

nbk 112
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 09:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే! సుధాకర్‌ చెరుకూరి, సుధాకర్‌ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఎన్‌బీకే 112’ వర్కింగ్‌ టైటిల్‌తో రానున్న ఈ సినిమాను ఈ నెల 25న ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెం-టీటీడీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఓ పోస్టర్‌ విడుదల చేసి తెలిపింది. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధా ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న ‘ఎన్‌బీకే 111’ చిత్రం పూర్తి చేశాక ఈ సినిమా సెట్స్‌కు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. హీరోయిన్‌, ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడిస్తారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్