mh ad
బుధవారం, 24 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అరుణాచల్​ను ముంచెత్తిన మెరుపు వరదలు

3 గంటల క్రితం

rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 25, 2026, 12:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పన్యోర్ జిల్లాలో మెరుపు వరదలు ముంచెత్తాయి. యజాలి సర్కిల్‌లో గత 24 గంటల్లో 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇందులో అధిక భాగం బుధవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య మూడు గంటల వ్యవధిలో కురిసింది. ఇక్కడికి సమీపంలోని నీప్కో ప్రాజెక్ట్ కాలనీ వద్ద వరద పోటెత్తడంతో ముగ్గురు గల్లంతయ్యారు. నిర్మాణంలో ఉన్న రక్షణ గోడ కూలిపోవడంతో రీగా వరద నీరు కాలనీల్లోకి, చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల్లోకి ప్రవేశించింది. కనీసం 18 నివాస గృహాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. కాగా పర్వత ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జియాధల్, కుమ్టియా నదుల నీటిమట్టాలు పెరిగాయి. గోగాముఖ్- ధకువాఖానా రహదారి పూర్తిగా తెగిపోయింది. కొంతకాలంగా రహదారిని మూసివేశారు. అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పరిపాలన యంత్రాంగం సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కొండచరియలు విరిగిపడడంతో పరిస్థితి దారుణంగా ఉందని చెబుతున్నారు. లోతట్టుప్రాంతాలు, నదీ తీరాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు మానుకోవాలని విపత్తు నిర్వహణ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్‌‌డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని ఇప్పటికే మోహరించగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి బయలుచేరింది. యాజాలి అధికార పరిధిలో అందుబాటులో ఉన్న సిబ్బంది, వాహనాలను సిద్ధం చేయడంతోపాటు, అత్యవసర కార్యకలాపాల కోసం మాజీ సైనికుల సాయం కూడా తీసుకుంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్