బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగారు గని కూలి.. 30 మంది గని కార్మికులు మృతి

1 గంట క్రితం

africa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 08:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో బంగారు గని ప్రమాదం

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: పశ్చిమ ప్రాంతంలోని ఓ బంగారు గని కూలిపోవడంతో సుమారు 30 మంది గని కార్మికులు మృతి చెందారు. మరికొందరు గనిలో చిక్కుకుపోయినట్లు అధికారులు, స్థానికులు తెలిపారు. నానా-మాంబెరే ప్రిఫెక్చర్‌లోని అబ్బా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పాత పద్ధతులు, చేతి పనిముట్లతో నిర్వహిస్తున్న గని ఒక్కసారిగా కూలిపోవడంతో కార్మికులు మట్టిలో చిక్కుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన గని కార్మికుడు ఫ్లోరియన్ గగుండే మాట్లాడుతూ.. గనిలో చిక్కుకున్న మరికొందరి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. అయితే, సమయం గడుస్తున్న కొద్దీ వారిని సజీవంగా వెలికితీసే అవకాశాలు తగ్గుతున్నాయని తెలిపారు. సహాయక బృందాలు, స్థానికులు గంటల తరబడి శ్రమించి శిథిలాల నుంచి 30 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన కార్మికులకు చికిత్స అందిస్తున్నట్లు సబ్‌-ప్రిఫెక్చర్ డిప్యూటీ మేయర్ సౌలేమాన్ బి వెల్లడించారు.

రక్షణ చర్యలు కొనసాగింపు

గనిలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు మరింత మంది సంస్థలు, స్థానికులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రమాదం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో వేలాది మంది చిన్న తరహా, చేతివృత్తి గనుల తవ్వకంపై ఆధారపడి జీవిస్తున్నారు. అయితే తగిన భద్రతా ప్రమాణాలు, రక్షణ పరికరాలు లేకపోవడంతో గని కూలిపోవడం వంటి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్