ఫ్రాన్స్‌లో పెరిగిన నిత్యావసర ధరలు, తక్కువ వేతనాలు, ఆర్థిక ఇబ్బందులకు వ్యతిరేకంగా ఆదివారం భారీ నిరసనలు జరిగాయి. సుమారు 8 లక్షల మంది నిరసనకారులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారి, లిమోజెస్ నగరంలోని 143 ఏళ్ల చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు పెట్టారు. దేశవ్యాప్తంగా సుమారు 1,200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హెచ్చరించారు.
ఫ్రాన్స్‌లో తీవ్ర ఉద్రిక్తత..చారిత్రక టౌన్ హాల్‌కు నిప్పు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 18, 2026, 11:10 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)