సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెనడాలో సైనిక శిక్షణా స్థావరంలో ఘోర అగ్నిప్రమాదం

1 గంట క్రితం

fire.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026, 10:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • నలుగురు సైనికులు మృతి.. 39 మందికి గాయాలు

అల్బెర్టా: కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్‌లో ఉన్న సైనిక శిక్షణా స్థావరంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 39 మంది గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 19 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కెనడియన్ ఫోర్సెస్ బేస్ వైన్రైట్‌లో సైనికులు లైవ్ మందుగుండు సామగ్రితో యుద్ధ శిక్షణ నిర్వహిస్తున్న సమయంలో శిక్షణా ప్రాంతంలోని గడ్డి మైదానంలో మంటలు చెలరేగాయి. గంటకు 96 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలుల కారణంగా మంటలు అత్యంత వేగంగా వ్యాపించాయి. కేవలం 30 నుంచి 60 సెకన్ల వ్యవధిలోనే మంటలు సుమారు కిలోమీటరు మేర విస్తరించడంతో సైనికులు ప్రమాదంలో చిక్కుకున్నారు.

ప్రధాని మార్క్ కార్నీ దిగ్భ్రాంతి

ఈ దుర్ఘటనపై కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శాంతికాలంలో కెనడా గడ్డపై సాయుధ దళాలు ఎదుర్కొన్న అత్యంత విషాదకర ఘటనల్లో ఇదొకటిగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్