గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionటిబెట్‌‌లో భారీ భూకంపం

57 నిమిషాల క్రితం

టిబెట్‌‌లో భారీ భూకంపం
- రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 11:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • రిక్టర్‌ స్కేలుపై 7.0 తీవ్రత నమోదు

బీజింగ్‌ : చైనాలోని టిబెట్ ఆటోనామస్ రీజియన్‌లో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టరు స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.0గా నమోదైందని చైనా భూకంప నెట్‌వర్క్స్ సెంటర్ (సిఇఎన్‌‌సి) వెల్లడించింది. గురువారం రాత్రి 10.33 గంటలకు బాకెం కౌంటీలో ఈ భూకంపం సంభవించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని సిఇఎన్‌‌సి తెలిపింది. ఈ భారీ భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి తక్షణ సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ టిబెటన్ పీఠభూమి, యురేషియన్, ఇండియన్ టెక్టోనిక్ పలకలు కలిసే ప్రదేశంపై ఉందని, తరచుగా ఈ పలకలు భారీ శక్తితో ఢీకొంటూ భారీ భూకంపాలను సృష్టిస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాగ్చు నుండి లాసా వరకూ ఈ ప్రకంపనలు నమోదు అయ్యాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్