సోమవారం, 19 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కెనడా సైనిక శిక్షణలో ఘోర అగ్నిప్రమాదం

2 గంటల క్రితం

కెనడా సైనిక శిక్షణలో ఘోర అగ్నిప్రమాదం
- నలుగురు సైనికులు మృతి
- 39 మందికి గాయాలు, 19 మంది పరిస్థితి విషమం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:16 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- నలుగురు సైనికులు మృతి

- 39 మందికి గాయాలు, 19 మంది పరిస్థితి విషమం

ఒట్టావా : కెనడాలోని ఆల్బెర్టా సైనిక స్థావరంలో లైవ్-ఫైర్ శిక్షణ సమయంలో మంటలు చెలరేగి నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 39 మంది గాయపడగా, వారిలో 19 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు ఆదివారం వెల్లడించారు. ఎడ్మంటన్ కేంద్రంగా పనిచేసే 3వ బెటాలియన్, ప్రిన్సెస్ ప్యాట్రిసియాస్ కెనడియన్ లైట్ ఇన్‌ఫాంట్రీకి చెందిన చార్లీ కంపెనీ సభ్యులు శనివారం గ్రెనేడ్ రేంజ్‌లో, శత్రు స్థావరాలపై దాడుల శిక్షణ తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది.

సెకన్లలో చుట్టుముట్టిన మంటలు

స్థావరానికి సుమారు ఒక కిలోమీటరు దూరంలో మంటలను సైనికాధికారులు గమనించారు. అయినా శిక్షణను కొనసాగించవచ్చని భావించారు. అయితే గాలి దిశ అకస్మాత్తుగా మారడంతో కేవలం 36 సెకన్లలోనే మంటలు సైనికులను చుట్టుముట్టాయి. క్షణాల్లో మంటలు వ్యాపించాయని, సైనికులకు తప్పించుకునే అవకాశమే లేకుండా పోయిందని మేజర్ జనరల్ వేడ్ రట్ల్యాండ్ తెలిపారు. ఈ ప్రమాదంలో సార్జెంట్ మోర్గాన్ వాంగ్, ప్రైవేట్ షాన్ ఫారెల్, ప్రైవేట్ ఐడాన్ గౌల్డింగ్, ప్రైవేట్ హేడెన్ లైక్‌మార్క్ లు మరణించారని అధికారులు ధృవీకరించారు. గాయపడినవారిని అంబులెన్సులు, విమానాలు, హెలికాప్టర్ల ద్వారా ఆల్బెర్టాలోని ప్రధాన ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా కాలిన కొందరికి నెలల తరబడి వైద్య చికిత్స అవసరమవుతుందని అధికారులు తెలిపారు. శాంతి సమయంలో కెనడా సైన్యంలో జరిగిన అత్యంత దారుణ విషాదాల్లో ఇదొకటని ప్రధాని మార్క్ కార్నీ విచారం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా సమాఖ్య భవనాలపై జాతీయ పతాకాన్ని సగం ఎత్తుకు దించాలని ఆదేశించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్