గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోలెండ్‌ ప్రధాని టస్క్‌‌తో మోడీ భేటీ

37 నిమిషాల క్రితం

శాంతి స్థాపనకు భారత్‌ తోడ్పాటు
పోలెండ్‌ ప్రధాని టస్క్‌‌తో ప్రధాని మోడీ భేటీ
వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరణకు పలు నిర్ణయాలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026, 12:23 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వ్యూహాత్మక భాగస్వామ్యం విస్తరణకు పలు నిర్ణయాలు

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌, పశ్చిమాసియాల్లో శాంతి నెలకొనేందుకు జరిగే ప్రతి అర్ధవంతమైన ప్రయత్నానికి భారత్‌ ‌మద్దతునిస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రస్తుతం మూడు రోజుల పాటు భారత్‌‌లో పర్యటిస్తున్న పోలెండ్‌ ‌ప్రధాని డొనాల్డ్‌ ‌టస్క్‌‌తో గురువారం భేటీ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో విస్తృతాంశా లపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. భారత్‌, పోలెండ్‌ ‌మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అనేక నిర్ణయాలు తీసుకున్నామని మోడీ తెలిపారు. మొత్తంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు పెంపొందించేందుకు ఇరు పక్షాలు కృత నిశ్చయంతో వున్నాయని చెప్పారు. రక్షణ, రోదసీ, అణు ఇంధన రంగాల్లో సంబంధాల వృద్ధికి ఒక అవగాహన కుదిరిందన్నారు. ఈ వ్యూహాత్మక రంగాలన్నింటిలో భారత్‌‌తో కలిసి ఉత్పత్తి చేపట్టడానికి, అభివృద్ధిపరచడానికి పోలెండ్‌ ‌కంపెనీలను ఆహ్వానించామని వెల్లడించారు. పెరుగుతున్న ద్వైపాక్షిక ఆర్థిక వృద్ధి ఇరు దేశాల భాగస్వామ్యానికి కొత్తగా అవకాశాలు కల్పించిందన్నారు. యురోపియన్‌ ‌యూనియన్‌‌తో భారత్‌ ‌చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత స్థిరీకరించబడతాయన్నారు. భారత్‌, పోలెండ్‌ ‌రెండూ ప్రజాస్వామ్య విలువలు కలిగిన దేశాలేనని, చట్టబద్ధ పాలనను గౌరవించేవేనని పేర్కొన్నార. అంతర్జాతీయ పాలనా సంస్థలు మరింత సమర్ధవంతంగా, సాధికారతతో పని చేయాలంటే సంస్కరణలు తప్పనిసరని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్