రోమ్ : పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన కుడి ఊపిరితిత్తిలోని కింది భాగాన్ని తొలగించారని, ఆపరేషన్ విజయవంతం అయిందని వాటికన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 71 సంవత్సరాల పోప్ లియోకు మంగళవారం రోమ్‌లోని జెమెల్లీ ఆస్పత్రిలో 90 నిమిషాల పాటు శాస్త్రచికిత్స చేశారు. ఆయనకు లంగ్ అడెనోకార్సినోవా ఉన్నదని వైద్యులు నిర్ధారించారు. అధికారులు తెలిపిన వివారల ప్రకారం...ఆపరేషన్ విజయవంతం అయింది. ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ఆపరేషన్ తర్వాత పోప్ స్పృహలోకి వచ్చి కొద్దిసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండి తన గదికి చేరుకున్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ ఆయన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. వచ్చే నెల ప్రారంభంలో పోప్ లాటిన్ అమెరికాలో పర్యటించాల్సి ఉంది. దీంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయించుకోనున్నారు.
Print Editionపోప్ లియోకు శస్ర్త చికిత్స
14 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)