ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే, అఖిల భారత విద్యార్థి సంఘం (ఎఐఎస్‌ఎ) అధ్యక్షులు నేహా బోరాను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. ఢిల్లీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్‌ఇఎం) కోర్టు ఈ మేరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో ‘లెహ్రా దో తిరంగా’ (త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయండి) నిరసన ప్రదర్శనకు వెళ్తుండగా పోలీసులు అభిజీత్ దీప్కేను నిర్బంధించి, అనంతరం అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. బిఎన్‌ఎస్‌ఎస్ 126వ సెక్షన్ కింద శాంతి భద్రతలకు విఘాతం కలిగించబోనని హామీ ఇస్తూ బాండ్ సమర్పించాలని దీప్కేని ఎస్‌ఇఎం ఆదేశించారు. ఏడాది పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకూడదనే షరతుతో ఆయన విడుదలయ్యారు. ఈ కేసులో తదుపరి నిర్బంధం అవసరం లేదని పేర్కొంటూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా శుక్రవారం తిరంగా మార్చ్‌లో పాల్గొన్న ఎఐఎస్ఎ అధ్యక్షులు నేహాబోరాను మండిహౌస్ సమీపంలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమె ఎక్కడ ఉన్నారనేది రహస్యంగా ఉంచటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఆమెను ఆర్‌కె పురం పోలీస్‌స్టేషన్ నుంచి ఆమెను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.
అభిజీత్ దీప్కే, నేహాబోరా విడుదల
6 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)