శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బెంగాల్‌లో సిపిఎం సభపై బిజెపి దాడి

1 గంట క్రితం

బెంగాల్‌లో సిపిఎం సభపై బిజెపి దాడి
- పది మందికి తీవ్ర గాయాలు 
- పోలీసుల సమక్షంలోనే వేదిక ధ్యంసం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- పది మందికి తీవ్ర గాయాలు

- పోలీసుల సమక్షంలోనే వేదిక ధ్యంసం​

కోల్‌కతా: బెంగాల్‌‌లోని బిజెపి ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులను కొనసాగిస్తుంది. తాజాగా శుక్రవారం నాడు బిపణి మోర్‌ ‌వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ( మార్క్సిస్టు) సిపిఎం నిర్వహిస్తున్న బహిరంగ సభపై బిజెపి గూండాలు దాడి చేసి సిపిఎం కార్యకర్తల తలలు పగలకొట్టారు. ఈ కార్యక్రమంలో వేదికను పూర్తిగా ధ్వంసం చేశారు, వేదికపై ఉన్న సామగ్రిని పగలగొట్టి విసిరేశారు. అడ్డోచ్చిన మహిళా కార్యకర్తలపై దాడకి తెగబడ్డారు. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగటం గమనార్హం. బిజెపి దాడి వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్ అయింది. వేదికను ధ్వంసం చేస్తుంటే ఒక మహిళ వేదికపై కదలకుండా నిలబడి, చేతిలో గాంధీ చిత్రపటాన్ని పట్టుకుని ఉన్నారు. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు. కర్రలు, రాడ్లతో బిజెపి గూండాలు విధ్యంసం సృష్టించారు. అయితే గత పదిహేనేళ్లలో ప్రభుత్వం మారినా బెంగాల్‌లో వామపక్షాల ర్యాలీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయని, బిజెపి ఏలుబడిలో విపక్షాలకు స్వేచ్చ లేకుండా పోయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్