ఆదివారం, 27 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రోడ్డు నాణ్యతగా లేదన్న వ్యక్తిపై బిజెపి మంత్రి దాడి

7 గంటల క్రితం

రోడ్డు నాణ్యతగా లేదన్న వ్యక్తిపై బిజెపి మంత్రి దాడి
- ఢిల్లీ నడిరోడ్డుపై చేయుచేసుకున్న  వైనం
- ఖండించిన ఆప్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 27, 2026, 08:53 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఢిల్లీ నడిరోడ్డుపై చేయుచేసుకున్న వైనం

- ఖండించిన ఆప్‌

న్యూఢిల్లీ : డబుల్‌ ఇంజన్‌ ‌సర్కార్‌ బిజెపి ‌ప్రభుత్వం దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన రోడ్డు అత్యంత నాసిరకంగా ఉన్నాయి. అయితే, రోడ్డు నాణ్యతగా లేదని ఢిల్లీ పౌరుడు పిడబ్ల్యుడి బిజెపి మంత్రి పర్వేష్‌ ‌సాహిబ్‌ ‌సింగ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి ఆ వ్యక్తిపై దాడి చేశాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అయింది.

ముక్కలు ముక్కలుగా ఊడిపోతున్న రోడ్డు

పశ్చిమ ఢిల్లీలోని వికాస్‌ పురి ఏరియాలో కొత్తగా వేసిన రోడ్డును చూసేందుకు మంత్రి తన భద్రతా సిబ్బందితో వచ్చారు. రోడ్డు నిర్మాణం నాసిరకంగా వుందని, ముక్కలు ముక్కలుగా విడిపోయి చేతుల్లోకి వస్తోందని ఆప్‌ ఎంఎల్‌ఎ జర్నైల్‌ ‌సింగ్‌, పార్టీ కార్యకర్తలు మరికొంతమంది మంత్రికి చూపించారు. వారి వెంటే వున్న నల్లని టీ షర్ట్‌ ‌ధరించిన ఒక వ్యక్తి తన మొబైల్‌‌లో ఇదంతా చిత్రీకరిస్తున్నారు. రికార్డింగ్‌ ‌చేస్తూ ఆ వ్యక్తి తన సమీపానికి రాగానే మంత్రి ఒక్కసారిగా ఆ వ్యక్తిపై చేయి చేసుకోవడం వీడియోలో కనిపిస్తోంది. వెంటనే ఆప్‌ ‌కార్యకర్తలు ఆ వ్యక్తిని వర్మకు దూరంగా లాక్కుని వెళ్ళారు, మంత్రి అనుచితంగా ప్రవర్తించారంటూ నిరసన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడే గల స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సోషల్‌ ‌మీడియాలో ఈ వీడియో వైరల్‌ ‌కాగానే, నెటిజన్ల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘రోడ్డు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిని బయటపెట్టినందుకు యువకుడిపై బహిరంగంగా బిజెపి మంత్రి చేయి చేసుకున్నారు.’’ అని ఆప్‌ ‌జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ మాజీ మంత్రి అరవింద్‌ ‌కేజ్రివాల్‌ ఎక్స్‌ ‌పోస్టులో పేర్కొన్నారు. రేపు తాను అక్కడకు వెళ్ళి రోడ్డును పరిశీలిస్తానని చెప్పారు. కాగా ఈ ఘటనపై మంత్రి స్పందిస్తూ, ఆప్‌ ‌కార్యకర్తలు తన కుటుంబాన్ని దూషించడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. అయినా ఈ ఘటన జరిగి వుండాల్సింది కాదని వ్యాఖ్యానించారు. అనుచితంగా వ్యవహరించిన వర్మపై కేసు నమోదు చేయనున్నట్లు ఆప్‌ ఎంఎల్‌ఎ జర్నైల్‌ ‌సింగ్‌ ‌తెలిపారు. తక్షణమే మంత్రిపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కొత్తగా నిర్మించిన రోడ్డు నాణ్యతపై శనివారం జర్నైల్‌ ‌సింగ్‌ ఎక్స్‌‌లో పోస్టు పెట్టారు. ప్రజా నిధులతో చేపట్టే ప్రతి అభివృద్ధి పనిలోనూ పారదర్శకత, నాణ్యత తప్పనిసరి, జరిగిన పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు చూపించాలి, దాని ప్రకారం పనులు జరిగాయో లేదో నిర్ధారించాలి, నాణ్యతా పరీక్షలు నిర్వహించాలి. ఒకవేళ ఏవైనా లొసుగులు, లోపాలు వున్నట్లు తేలితే వెంటనే నాణ్యతా నియంత్రణా బృందం తనిఖీలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. ప్రజలు చైతన్యవంతులై, ప్రశ్నలు అడిగి, జవాబుదారీతనం వుండేలా చూసినపుడే వ్యవస్థలో మెరుగుదల వుంటుందని వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్