న్యూఢిల్లీ : సిజెపి ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్ అజింక్య షిండే నేతృత్వం వహిస్తారని అభిజీత్ దీప్కే ఒక వీడియోలో తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో అభిజీత్ దిప్కే, సౌరవ్‌దాస్, అశుతోష్ రంకాలను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి తమ సంస్థ 'ఆర్గనైజేషన్ ఇన్‌ఛార్జ్' అజింక్య షిండే నాయకత్వం వహిస్తారని తెలిపారు.తాము అదుపులో ఉన్నంతకాలం అజింక్య నేతృత్వం వహిస్తారని అన్నారు. తాము అరెస్టు అయ్యే అవకాశం ఉందని ముందుగానే ఊహించిన అభిజీత్, ఈ వీడియోను శుక్రవారం రాత్రే రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ.బేబి సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు.
మమతా బెనర్జీ సహా టిఎంసి నేతల అరెస్ట్
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా టిఎంసి నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె సౌత్ అవెన్యూ బస్ స్టాండ్ సమీపంలో ధర్నా చేపట్టారు. సౌత్ అవెన్యూ నుండి కదలడానికి తనను అనుమతించడం లేదని అన్నారు. మమతా బెనర్జీ సహా ఇతర పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టిఎంసి ఎంపి సాకేత్ గోఖలే పేర్కొన్నారు. వారిని గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని అన్నారు.









కామెంట్‌లు (0)