న్యూఢిల్లీ : జంతర్‌మంతర్‌లో సిఇసి జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు సంబంధించిన నిరసనను కవర్ చేస్తుండగా ఎసిపి వివేక్ బాఘట్ తనను లైంగికంగా వేధించారని ఒక మహిళా జర్నలిస్ట్ వెల్లడించారు. శనివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. కేసు నమోదు చేయలేదని అన్నారు. ‘ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్‌ఎ)’ అధ్యక్షురాలు నేహాబోరాను అదుపులోకి తీసుకోవడాన్ని కవర్ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని అన్నారు. ఎసిపి వివేక్ భగత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి తాను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లానని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఆమె పేర్కొన్నారు. సుమారు మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్ బయట వేచిఉన్నానని తెలిపారు. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని, దానికి బదులుగా కేసు నమోదు చేసే ముందు ప్రాథమిక విచారణ జరిపి, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరుకుంటున్నారని మహిళా జర్నలిస్ట్ తెలిపారు ఆ వీడియోలో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు సంబంధించి లలితా కుమారి తీర్పులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నిబంధనలకు ఈ విధానం అనుగుణంగా ఉందా అని ఆమె ప్రశ్నించారు. ఫిర్యాదు నమోదు చేయడానికి బదులుగా, ఢిల్లీ పోలీసులు ఆ ఎసిపిని కాపాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్వతంత్ర జర్నలిస్టుల బృందం పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన చేపట్టింది. ఎసిపిపై చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ పోలీసులు ఆమెను వైద్య పరీక్షల కోసం ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని 'కాక్రోచ్ జనతా పార్టీ'కి చెందిన న్యాయ వ్యవహారాల విభాగం అధిపతి రత్న సింగ్ తెలిపారు. అనంతరం ఆమెను తిరిగి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలను ధృవీకరించేందుకు ఎటువంటి ఆధారాలు లేనందున, ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపారు. కేసు నమోదు చేయడానికి ముందు ఆ ఫిర్యాదుపై విచారణ చేపడుతున్నామని అన్నారు.
మహిళా జర్నలిస్ట్‌పై ఎసిపి లైంగిక వేధింపులు.. ఎఫ్‌ఐఆర్ నిరాకరణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)