ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హరీష్‌ రావత్‌ పిఎ నివాసాలపై ఇడి సోదాలు

6 గంటల క్రితం

harish
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 13, 2026, 02:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- కాంగ్రెస్‌‌కు రాజీనామా చేసిన ఉత్తరాఖండ్‌ మాజీ సిఎం

డెహ్రాడూన్‌ : తన పిఎ నివాసాలపై ఇడి సోదాలు నిర్వహించిన తరువాత రోజే ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు, జాతీయ స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడు పదవులకు శనివారం రాజీనామా చేశారు. 2016లో ఉత్తరాఖండ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ నియామక పరీక్షలో ఓఎంఆర్ షీట్లను మార్చి అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటూ హరీష్‌ ‌రావత్‌ ‌పిఎ చందన్ సింగ్ జీనా ఇంట్లో ఇడి శుక్రవారం దాడులు చేసింది. అతని ఇంట్లో నుండి లెక్కల్లో చూపని రూ.32 లక్షల నగదు, 13 బంగారు నాణేలు, సుమారు 200.5 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు, ఖరీదైన బ్రాండ్లకు చెందిన 12 విలాసవంతమైన చేతి గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇడి పేర్కొంది. ఇడి సోదాల అనంతరం ఎక్స్ వేదికగా రావత్‌ ఒక కీలక ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యుడు, జాతీయ స్థాయిలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో శాశ్వత ఆహ్వానిత సభ్యుడి పదవులకు రాజీనామా చేస్తున్నానని, అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, కార్యకర్తలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్