రైపిళ్లు, గ్రనేడ్లు, డ్రగ్స్ స్వాధీనం
ఇంఫాల్ : స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివాసీ తెగల మధ్య బిజెపి రాజేసిన హింసాగ్ని ఇంకా కొనసాగుతూనేవుంది. ఘర్షణలు, హింస నిత్యకృత్యంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రతా బలగాలు, స్థానిక పోలీసులతో కలిసి భారీ ఆపరేషన్ చేపట్టినట్లు మణిపూర్ పోలీసులు మంగళవారం వెల్లడించారు. వారి కథనం ప్రకారం.. నిఘా విభాగం అందించిన సమాచారంతో సోమవారం రాత్రి చురాచంద్‌పుర్ జిల్లా పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) 129 బెటాలియన్, 5 అసోం రైఫిల్స్‌కు చెందిన సంయుక్త బృందం 'ఎమ్ సాంగ్‌గెల్' సమీపంలోని కింగ్‌కిన్ గ్రామంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న తెల్లటి బొలెరో వాహనాన్ని అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో విదేశాల్లో తయారైన ఎకె-సిరీస్ రైఫిల్, ఎంఎఐ రైఫిల్, 240 రౌండ్ల వివిధ రకాల మందుగుండు సామగ్రి, సుమారు 1.027 కిలోల బ్రౌన్ షుగర్ ఉన్న రెండు ప్లాస్టిక్ ప్యాకెట్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డి లాంగ్‌జోల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల లెట్‌ఖోతాంగ్ ఖోంగ్సాయ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో తాను సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఒఒ) గ్రూప్‌నకు చెందిన కెఎన్‌ఎఫ్ (ఎంసి) కేడర్నని చెప్పాడు.







కామెంట్‌లు (0)