శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారంలో ఉండే నైతిక హక్కు మోడీ ప్రభుత్వానికి లేదు

2 రోజుల క్రితం

jai ram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ : పిఎం-దక్ష పథకం అమల్లో అనేక లోపాలు ఉన్నాయని, ఒక్క పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేని మోడీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. మోడీ ప్రభుత్వానికి "గడువు సమీపిస్తోందని" తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేష్ బుధవారం నాడు ఎక్స్‌‌లో ఒక పోస్టు చేశారు. ఒక మీడియా సంస్థ ప్రచురించిన కథనాన్ని స్క్రీన్‌షాట్‌‌తో పంచుకున్నారు. ‘ప్రధాన మంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హితగ్రాహి’ (పిఎం-దక్ష) పథకం అమలులో “తీవ్రమైన లోపాలు” బయటపడ్డాయని ఆ కథనం పేర్కొంది. ఎస్‌‌సిలు, ఒబిసిలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, డీనోటిఫైడ్, సంచార తెగలు, చెత్త ఏరుకునేవారు, పారిశుధ్య కార్మికులు మొదలైన వారిలో అర్హులైన వ్యక్తులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగాలు లేదా స్వయం ఉపాధికి సిద్ధం చేసే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘ఈ పథకం పేరు గొప్పగా ఉంది. కానీ ఫలితాలు లేవు’ అని జైరాం రమేష్‌ ‌విమర్శించారు. అట్టడుగు వర్గాలకు నైపుణ్యాలు, శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన ఈ పథకాన్ని మోడీ ప్రభుత్వం కేవలం కాగితాలకే పరిమితం చేసిందని అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రజల నమ్మకం కొల్పోయిందని ఆరోపించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్