నవంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలు
బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం నందిని పాల ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. లీటరు పాలపై రూ. 8 చొప్పున ధర పెంచే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించినట్లు సమాచారం. కొత్త ధరలు నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మిల్క్ యూనియన్లు లీటరు పాలపై రూ. 8 నుంచి రూ. 10 వరకు ధర పెంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లీటరుకు రూ. 8 పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బ్లూ కలర్ ప్యాకెట్‌లో లభించే నందిని బేసిక్ టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ. 46గా ఉంది. తాజా ధరల పెంపుతో ఇది రూ. 54కు చేరనుంది.
రైతులకు ప్రయోజనం
పెంచిన రూ. 8లో రూ. 7 నేరుగా పాల ఉత్పత్తిదారులకు, మిగిలిన రూ. 1 మిల్క్ యూనియన్లకు అందుతుందని కర్ణాటక మంత్రి కృష్ణ బైరేగౌడ వెల్లడించినట్లు సమాచారం. ఈ నిర్ణయం వల్ల పాడి పరిశ్రమపై ఆధారపడిన సుమారు 10 లక్షల రైతు కుటుంబాలకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.







కామెంట్‌లు (0)