గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

నీట్‌-పీజి పరీక్ష‍ా ఫలితాలు విడుదల

1 గంట క్రితం

neet-pg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 03:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురువారం మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బిఇఎంఎస్‌) విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్‌- పీజీ పరీక్షకు 2,63,544 మంది హాజరు కాగా.. సెప్టెంబర్‌ 5న జైపుర్‌లో నిర్వహించిన ఈ పరీక్షకు 2,416మంది అభ్యర్థులు హాజరైనట్లు బోర్డు తెలిపింది. అభ్యర్థుల అప్లికేషన్ సీక్వెన్స్‌ నంబర్‌, రోల్‌ నంబర్‌, సాధించిన స్కోరు, నీట్‌ పీజీ 2026 ర్యాంకులతో కూడిన ప్రత్యేక జాబితాతో పాటు కటాఫ్‌ స్కోరును కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 1నుంచి అభ్యర్థులు తమ స్కోరు కార్డులను అధికారిక వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్