శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionశబరిమల మకరజ్యోతి యాత్రకు 29 నుంచి ఆన్‌లైన్‌ బుకింగ్‌

27 అక్టోబర్, 2026

Online booking for the Sabarimala Makarajyothi pilgrimage begins on the 29th
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

తిరువనంతపురం : కేరళలోని ప్రఖ్యాత అధ్యాత్మిక క్షేత్రం శబరిమల మండల - మకరవిళక్కు (మకరజ్యోతి) యాత్రకు సంబంధించిన వర్చువల్‌ ‌క్యూ బుకింగ్ ఈ నెల 29వ తేదీ ఉదయం గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు (టిడిబి) మంగళవారం తెలిపింది. అధికారిక పోర్టల్‌ www.sabarimalaonline.org వెబ్​సైట్​ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చునని సూచించింది. శబరిమల దర్శనానికి వచ్చే యాత్రికుల రద్దీని నియంత్రించి, యాత్రను సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు రోజువారీ బుకింగ్‌ పరిమితులను నిర్ణయించినట్లు పేర్కొంది. పంబ నుంచి సన్నిధానం చేరుకునే వారికి వర్చువల్‌ క్యూ పాస్‌ పొందడం తప్పనిసరి అని పేర్కొంది. ప్రధాన మార్గమైన నిలక్కల్‌-పంబ ద్వారా రోజుకు 60 వేల మంది అయ్యప్ప మాలధారులకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం కల్పించినట్లు తెలిపింది. ఎరుమేలి అటవీ మార్గం, వండిపెరియార్‌-సత్రం మార్గాల ద్వారా రోజుకు 3 వేల మంది చొప్పున బుక్‌ చేసుకోవచ్చునని తెలిపింది. కాగా ఆన్‌‌లైన్‌‌లో ముందస్తు బుకింగ్‌ చేసుకోలేని వారి కోసం కొన్ని ప్రాంతాల్లో స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు టిడిబి తెలిపింది. నిలక్కల్‌లో రోజుకు 10 వేల మంది, ఎరుమేలి వద్ద రోజుకు 2 వేల మంది, అలాగే వండిపెరియార్‌ సత్రం వద్ద రోజుకు 2 వేల మంది యాత్రికులకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది.

అయితే, కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు పంబలోని స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని పూర్తిగా తొలగించినట్లు తెలిపింది. వర్చువల్‌ క్యూ బుకింగ్‌ పూర్తిగా ఉచితమని, యాత్రికుల కోరుకుంటే పిలిగ్రిమ్‌ రిలీఫ్‌ ఫండ్‌, జనరల్‌ ఫండ్‌కు కనీసం రూ.5 నుంచి స్వచ్ఛందంగా విరాళం అందించవచ్చునని పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్