శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరాహుల్‌ గాంధీకి తృటిలో తప్పిన ప్రమాదం..

26 అక్టోబర్, 2026

రాహుల్‌ గాంధీకి  తృటిలో తప్పిన ప్రమాదం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 27, 2026, 12:07 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

లక్నో : లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీకి సోమవారం తృటిలో ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణిస్తున్న రాహుల్ గాంధీ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. రాహుల్ గాంధీ సురక్షితంగా బయటపడ్డారు. 91 కిలోమీటర్ల మైలురాయి సమీపంలో ఐదు వాహనాలు, ఒక అంబులెన్స్ ఢీకొన్నాయి. గాయపడిన వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కాన్వాయ్‌లో ఉన్న భద్రతా సిబ్బంది ఉన్నారు. ఉదయం సుమారు 10.15 గంటలకు ఈ ఘటన జరిగింది. కాన్వాయ్ ముందు భాగంలో ప్రయాణిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులకు చెందిన ఒక ప్రైవేట్ వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో, దాని వెనుక ఉన్న వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. పరువునష్టం కేసులో విచారణ కోసం సుల్తాన్‌పూర్ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు రాహుల్‌‌గాంధీ వెళుతుండా ఈ ప్రమాదం జరిగింది. ముందుగా లక్నో ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌ ‌గాంధీ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరారు. ఇది స్వల్ప ప్రమాదమేనని, ఘటన తర్వాత కాన్వాయ్‌ తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించారని అధికారులు వెల్లడించారు. మరోవైపు రాహుల్‌‌గాంధీపై పరువునష్టం కేసును సుల్తాన్‌పూర్‌ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. 2018 కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను ఈ కేసు నమోదయింది. సుల్తాన్‌పుర్‌కు చెందిన బిజెపి నేత విజయ్‌ మిశ్రా చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేశారు. .


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్