సోమవారం, 28 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎల్‌పియులో విద్యార్థినిపై లైంగిక దాడి - విద్యార్థుల నిరసన

1 గంట క్రితం

rajstha
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 28, 2026, 07:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జలంధర్: పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్‌పీయూ)లో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేస్తున్న నిరసన తీవ్రమవుతోంది. పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్ 28 నుంచి పది రోజుల పాటు సాధారణ తరగతులను నిలిపివేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యంతర పరీక్షలను కూడా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వాయిదా వేసినట్లు తెలిపారు. సవరించిన పరీక్షల తేదీలను యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించారు. క్యాంపస్ హాస్టల్‌లో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవడానికి బదులుగా ఘటనను కప్పిపుచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపించారు. బాధిత విద్యార్థిని తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. జలంధర్-ఫగ్వారా జాతీయ రహదారిపై కూడా నిరసన చేపట్టారు. దీంతో ఆందోళన క్యాంపస్‌ పరిధిని దాటి విస్తరించింది.

పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ఇళ్లకు వెళ్లాలని యూనివర్సిటీ అధికారులు సూచించారు. పది రోజుల విరామం అనంతరం తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో సంప్రదించి ఇంటికి వెళ్లవచ్చని తెలిపారు. క్యాంపస్‌లోనే ఉండే విద్యార్థులు హాస్టళ్లు లేదా తమ నివాసాల్లో ఉండాలని సూచించారు.

అయితే, విద్యార్థులు తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మహిళా విద్యార్థులకు న్యాయం చేయాలని, క్యాంపస్‌లో భద్రతను పటిష్ఠం చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ అఖిల భారత కమిటీ సంఘీభావం ప్రకటించింది. విద్యార్థుల భద్రత కంటే యూనివర్సిటీ ప్రతిష్టకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఎస్ఎఫ్ఐ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్