గురువారం, 01 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మమతా బెనర్జీ వర్గానికి సుప్రీంకోర్టలో చుక్కెదురు

1 గంట క్రితం

Mamata Banerjee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి వర్గానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్తంభింపచేసిన నాలుగు డెబిట్‌ బ్యాంకుల ఖాతాలను నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ ఆ వర్గం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తిరస్కరించింది. ఆ అభ్యర్థనను అనుమతించడానికి నిరాకరించిన కోల్‌కతా హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి తాము సుముఖంగా లేమని జస్టిస్‌ ఎం.ఎం. సుందరేష్‌, జస్టిస్‌ పి.బి. వర్లేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కమిషన్‌ (ఈసి) పార్టీ గుర్తును స్తంభింపచేసిందని, దీంతో ఆ మొత్తాన్ని పొందే అర్హత ఎవరికి ఉందనే ప్రధాన అంశంపై నిర్ణయం ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తించింది. తాము కేసులోని వాస్తవ అంశాల్లోకి వెళ్లాలనుకోవడం లేదని, ఆర్టికల్‌ 136కింద తమ అధికార పరిధిని వినియోగించుకోవడానికి తాము సుముఖంగా లేమని ధర్మాసనం పేర్కొంది. కేసు విచారణను వేగవంతం చేయాలని హైకోర్టును ఆదేశించింది.

సుమారు రూ.804 కోట్లు కలిగి ఉన్న నాలుగు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి వర్గం నిర్వహించుకోవడానికి అనుమతించే మధ్యంతర ఉత్తర్వును జారీ చేసేందుకు కోల్‌కతా హైకోర్టు ఆగస్టు 27న నిరాకరించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్