ఆదివారం, 04 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

6నెలల్లో బెంగాల్‌లో యుసిసి

1 గంట క్రితం

ucc
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 02:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- గుజరాత్‌ తరహాలో అమలు చేస్తాం

- ముఖ్యమంత్రి సువేందు అధికారి

కొల్‌‌కతా : పశ్చిమ బెంగాల్‌‌లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్వేశాలను రెచ్చగొడుతుంది. తాజాగా వివాదాస్పద ఉమ్మడి పౌర స్మృతి (యుససి)ని ఆరు నెలల్లో అమలు చేస్తామంటూ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. అంతేకాదు ఒక మతాన్ని టార్గెట్‌ ‌చేస్తూ ‘‘లవ్ జిహాద్’’, ‘‘ల్యాండ్ జిహాద్’’లకు వ్యతిరేకంగా కఠినమైన చట్టాలను తమ ప్రభుత్వం తీసుకొస్తుందని తెలిపారు. సంఘ్‌ ‌పరివార్‌ ‌సంస్థ విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌‌పి) మాజీ అధ్యక్షులు అశోక్ సింఘాల్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం నాడు కొల్‌‌కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఆరు నెలల్లో ఉత్తరాఖండ్, గుజరాత్ తరహాలో రాష్ట్రంలోను యుసిసిని అమలు చేస్తుందన్నారు. గాల్లోబిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేస్తుందని, అయితే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులను మాత్రం సహించదని చెప్పారు. తమ ప్రభుత్వం ఎలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలను అనుమతించదని చెప్పారు. ‘‘విభజన శక్తుల’’ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ రెచ్చగొట్టారు.

ప్రతిపాదిత మతపరమైన పర్యాటక సర్క్యూట్ గురించి మాట్లాడుతూ, దీని కోసం రూ. 1,000 కోట్లు కేటాయించామని, ఈ ప్రాజెక్ట్ రెండేళ్లలో పూర్తవుతుందని ఆయన తెలిపారు. టిఎంసి ప్రభుత్వం పతనానికి అనేక కారణాలు ఉన్నాయని, కానీ, ‘హిందువుల మనోభావాలు, సంస్థలు, దేవుళ్లు, సంప్రదాయాలను పదేపదే దెబ్బతీయడం’’ ప్రధాన కారణాలని అధికారి చెప్పుకొచ్చారు. అలాగే, తాను విద్యార్థి దశలో స్వచ్ఛంద కార్యకర్తగా రామజన్మభూమి ఉద్యమంలో పాల్గొన్నానంటూ గొప్పలకు పోయారు. అయితే, ఈ విషయాన్ని టిఎంసి నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన ఏనాడు ప్రస్థావించకపోవడం గమనార్హం. కాగా, యుసిసి ముసాయిదాను పరిశీలించేందుకు బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్