న్యూఢిల్లీ : ఇంగ్లీష్, కామర్స్, సోషియాలజీ పున:పరీక్షకు సంబంధించిన ఫలితాలను యుజిసి-నెట్ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ) ఒక ప్రకటనలో తెలిపింది.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్‌ఎఫ్) ప్రదానం, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం, ఎన్‌టిఎ జూన్ 22 నుండి 30 వరకు 87 సబ్జెక్టులలో యుజిసి-నెట్ జూన్ 2026 పరీక్షను నిర్వహించింది. అయితే ఈ పరీక్షలోని మూడు పేపర్లలో అనేక తప్పులు ఉన్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, ఆ పేపర్లకు తిరిగి పరీక్షలు నిర్వహించింది. ఇంగ్లీష్ పేపర్‌ను సెప్టెంబర్ 9న ఉదయం 9.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మొదటి షిఫ్ట్‌లో నిర్వహించగా, కామర్స్ పేపర్‌ను అదే రోజు మధ్యాహ్నం 3.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు రెండవ షిఫ్ట్‌లో నిర్వహించారు. సోషియాలజీ పేపర్‌ను సెప్టెంబర్ 10 ఉదయం 9.00గంటలకు మొదటిషిప్ట్‌లో నిర్వహించారు. తాజాగా ఈ పరీక్ష ఫలితాలను ఎన్‌టిఎ విడుదల చేసింది.








కామెంట్‌లు (0)