మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

11న భారత నౌకాదళంలోకి ‘మహేంద్రగిరి’

1 గంట క్రితం

marin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:58 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : భారత నౌకాదళం స్వదేశీ పరిజ్ఞానంతో ప్రాజెక్ట్-17ఎ కింద తలపెట్టిన ఆరో స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి (ఎఫ్-38) యుద్ధ నౌక ఈ నెల 11న విశాఖపట్నంలో అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశించనుంది. తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరును దీనికి పెట్టారు. యుద్ధ నౌక డిజైన్‌‌ను భారత నౌకాదళం అందించగా ముంబయిలోని మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండిఎల్) నిర్మించింది. అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత, తక్కువ రాడార్ గుర్తింపు, అధిక స్థాయి ఆటోమేషన్, మెరుగైన రక్షణ వ్యవస్థలతో కూడిన ఈ నౌక కంబైన్డ్ డీజిల్ ఆర్ గ్యాస్ ప్రొపల్షన్ వ్యవస్థతో పనిచేస్తుంది. దీని ద్వారా అధిక వేగంతో పాటు దీర్ఘకాల సముద్ర కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యం లభిస్తుంది. 75 శాతానికిపైగా స్వదేశీ భాగాలతో నిర్మితమైన మహేంద్రగిరి కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి ప్రతీకగా నిలుస్తోంది. దీని నిర్మాణంలో పలు భారతీయ పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు భాగస్వామ్యం కావడంతో దేశీయ రక్షణ తయారీ రంగానికి మరింత బలం చేకూరిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్