mh ad
శనివారం, 27 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తాం : సిఎం చంద్రబాబు

1 గంట క్రితం

We will provide rehabilitation to farmers affected by the Veligonda project: CM Chandrababu.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 27, 2026, 02:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మార్కాపురం : వెలిగొండ ప్రాజెక్టు బాధిత రైతులకు పునరావాసం కల్పిస్తామని సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం మార్కాపురం జిల్లా గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ .... అభివృద్ధి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. తరతరాలుగా సాగు చేస్తున్న భూములను త్యాగం చేశారని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల భవిష్యత్తును మార్చబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురానికి మంచినీరు ఇవ్వాలని నందమూరి తారకరామారావు చాలా ఆలోచించారని, ఈ ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా వెలిగొండ గురించే అడిగేవారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. మార్కాపురమంటేనే కరువు ప్రాంతమని, ఇక్కడికి కృష్ణా జలాలు వస్తాయనే ఊహ కూడా ఉండేది కాదన్నారు. 1996లో తానే వెలిగొండకు పునాది వేశానని, పునరావాసానికి రూ.300 కోట్లు అందజేశామని చంద్రబాబు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్