న్యూఢిల్లీ : రాబోయే రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఉత్తరాఖండ్‌లో కీలక ప్రదేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని నిఘా సంస్థలకు సమాచారం అందింది. దీంతో ఈ రెండు రాష్ర్టాలలో నిఘా సంస్థలు భద్రతా హెచ్చరికలు జారీ చేశాయి. నిఘా సంస్థల సమాచారం ప్రకారం.. ఢిల్లీ, ఉత్తరాఖండ్‌లలో దేవాలయాలు, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ సంస్థల్ని, కీలక రాజకీయ నేతల్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఇమెయిల్ ద్వారా బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా ఘర్షణలు జరిగే కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. ఈ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చే దానిన్ని కనుగొనడానికి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా, ఈ ఏడాది రిపబ్లిక్‌డే సందర్భంగా ఢిల్లీలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించాయి.









కామెంట్‌లు (0)