mh ad
ఆదివారం, 28 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జపాన్‌లో మరోసారి భూకంపం

2 గంటల క్రితం

6.1-magnitude earthquake
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 28, 2026, 11:02 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో : జపాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. జపాన్‌ ఈశాన్య ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్‌ తీరంలో ఆదివారం తెల్లవారుజామున భూమి కంపించినట్లు జపాన్‌ వాతావరణ శాఖ (జెఎంఎ) ఒక ప్రకటనలో తెలిపింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదైంది. 41కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. మూడు రోజుల క్రితం జపాన్‌లోని ఇవాటే తీరంలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 6గా నమోదైంది. వారం రోజుల పాటు 6 తీవ్రతతో భూమి కంపించే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్