అదుపులో 14 ఏళ్ల బాలుడు
గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిద్రపోతున్న చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడిన 14 ఏళ్ల బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, శనివారం తెల్లవారుజామున తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు ఇంటి నుంచి ఎత్తుకెళ్లాడు. ఉదయం చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం ఇంటి సమీపంలోని పొలంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అనంతరం 14 ఏళ్ల బాలుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో నిందితుడు మద్యం మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారిని పొలంలో వదిలేసిన అనంతరం, ఆమె కోసం కుటుంబ సభ్యులు నిర్వహించిన గాలింపులో కూడా నిందితుడు పాల్గొన్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం బాలుడు పోలీసుల అదుపులో ఉండగా, అతడిని బాలల న్యాయ మండలి (జువెనైల్ జస్టిస్ బోర్డు) ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. చిన్నారి చికిత్స కొనసాగుతోందని, కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.








కామెంట్‌లు (0)