mh ad
సోమవారం, 22 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రెండో రోజుకు అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు

1 గంట క్రితం

jd
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 22, 2026, 07:41 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

హోర్ముజ్ జలసంధి వివాదంతో ఉద్రిక్తత

బర్గెన్‌స్టాక్ (స్విట్జర్లాండ్): అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు రెండో రోజుకు చేరాయి. అయితే హోర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించడం, అలాగే ఇరాన్‌పై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన హెచ్చరికలు చర్చలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. గత వారం కుదిరిన అవగాహన ఒప్పందం ఆధారంగా కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ఇరాన్ ప్రతినిధులతో చర్చలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ హెచ్చరించినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. అంతేకాకుండా, జలసంధిని అమెరికా తన నియంత్రణలోకి తీసుకుని సుంకాలు విధించే అవకాశాన్ని కూడా ఆయన హెచ్చరించారు.

ట్రంప్ వ్యాఖ్యల అనంతరం ఇరాన్ ప్రతినిధులు చర్చల నుంచి వాకౌట్ చేసినట్లు, ప్రస్తుతం పాకిస్తాన్ మరియు ఖతార్ మధ్యవర్తుల ద్వారా సందేశాల మార్పిడి కొనసాగుతున్నట్లు ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ తెలిపింది. అయితే చర్చలు పూర్తిగా నిలిచిపోలేదని అమెరికా దౌత్యవేత్తలు స్పష్టం చేశారు. లెబనాన్ పరిస్థితులు, అణు కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, అవగాహన ఒప్పందం అమలు వంటి విషయాలపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని వారు పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని జేడీ వాన్స్ తెలిపారు. ప్రపంచ చమురు సరఫరాలకు కీలకమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే లెబనాన్‌తో పాటు ప్రాంతీయ శత్రుత్వాలకు ముగింపు పలకడం ఈ చర్చల ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈరోజు చర్చలు ముగిసే అవకాశం ఉందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్